భారత్లో నూటికి నూరు… ఒక్క జనసేనే: పవన్ కల్యాణ్

అమరావతి (CLiC2NEWS): జనసేన గెలవడం ఆంధ్రప్రదేశ్లోని ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఫలితాల అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇది కక్ష సాధింపుల సమయం కాదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని అన్నారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయని తెలిపారు. పోటీ చేసింది 21 సీట్లే అయిన 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని స్పష్టం చేశారు. భారత దేశంలో వందకి వంద సాధించిన పార్టీ జనసేన ఒక్కటే అని తెలిపారు.