TS: డిసెంబ‌రులోగా 100 % వ్యాక్సినేష‌న్

అధికారుల‌కు వైద్య మంత్రి హ‌రీష్‌రావు ఆదేశం

హైద‌రాబాద్ (CLiC2NEWS): డిసెంబ‌రు 31 నాటికి రాష్ట్రంలో నూరు శాతం వ్యాక్సినేష‌న్‌ను పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను, వైద్యాధికారుల‌ను వైద్యారోగ్య మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు ఆదేశించారు. బుధ‌వారం మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై మంత్రివ‌ర్గ ఉపసంఘం స‌మావేశం అయింది. ఈ సంర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో క‌లెక్ట‌ర్లు, వైద్యాధికారులు, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో క‌రోనా ప‌రిస్థితులపై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను, ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తక్కువ జరిగిన ప్రాంతాలను గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నూరు శాతం పూర్తి చేయాలని సూచించారు.

మూడో ద‌శ‌ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి..
ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. క‌రోనా పోరులో మంన‌మంతా తొలి, రెండో దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కరోనా మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.