గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!
గుజరాత్‌లో భారీ ఆపరేషన్

అహ్మదాబాద్ (CLiC2NEWS): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రతి రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో శనివారం ఉదయం నుండి పలు నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. 1000 మందికి పైగా బంగ్లా దేశీ అక్రమ వలస దారులను గుర్తించారు. వీరంతీ తప్పుడు ధ్రువ పత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకీ తీసుకున్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్ లో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు హోంమంత్రి తెలిపారు.
ఉగ్రదాడి ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పాక్ జాతీయులు ఎవరైనా ఉంటే రాష్ట్రాన్ని వీడాలని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండే వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ వలస దారులు పోలీసులకు లొంగి పోవాలని సూచించారు.
పహల్గాం దాడిలో పాకిస్థాన్ హస్తం ఉందని పేర్కొన్న భారత్.. మన దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి వెళ్లి పోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అట్టారి-వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది.