పండుగ సందర్భంగా క్షమాభిక్షపొందిన 1004 మంది ఖైదీలు విడుదల..
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/srilanka-president.jpg)
కొలంబొ (CLiC2NEWS): క్రిస్మస్ పండుగ సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం 1004 మంది ఖైదీలను విడుదల చేసింది. పలు నేరాల్లో జరిమానాలు కట్టకుండా శిక్ష అనుభవిస్తున్నవారిని వెయ్యి మందకి పైగా ఖైదీలకు దేశాధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు. నేడు క్రిస్మస్ సందర్బంగా వారందని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
కిందటి వారం చేపట్టిన యాంటీ నార్కొటిక్ డ్రైవ్లో ఒకరిద్దరు కాదు.. ఏకంగా 15 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 1100 మందిని నిర్బంధ మిలిటరీ పునారావాస కేంద్రాలలో ఉంచారు. మిగతా వారిని జైళ్లలో ఉంచారు. దీంతో దేశంలోని జైళ్లన్నీ నిండిపోయినట్లు సమాచారం.