రాష్ట్రంలో 1,050 కొత్త బస్సులు.. ఆర్టిసి ఎండి సజ్జనార్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 400 కోట్లతో కొత్త బస్సులు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. రూ. 400 కోట్లతో అధునాతనమైప 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనగోలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువై మరిన్ని బస్సలు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఆర్టిసి ఎండి సజ్జనార్.. 400 ఎక్స్ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఎసి రాజధాని కొత్త బస్సలు రానున్నట్లు తెలిపారు. వీటికి తోడు హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
రేపు శనివారం 80 అత్యాధునిక కొత్త బస్సులను రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. వీటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఎసి, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి.