సుప్రీంకోర్టులో 107 పోస్టుల భర్తీ
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 107 పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి/ మాజి సైనికోద్యోగులు / దివ్యాంగులకు రూ.250 గా ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 25. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ లలో పరీక్షలు నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు
కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్ , గ్రూప్-ఎ గెజిటెడ్) -31
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి, నాన్ గెజిటెడ్) -33
పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి, నాన్ గెజిటెడ్ ) – 43
కోర్టు మాస్టర్ పోస్టుకు నెలకు వేతనం రూ. 67,700, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కు రూ.47,600, పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.44,900 వేతనం అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://www.sci.nic.in/ వెబ్‌సైట్ చూడగలరు.