కడుపులో 108 హెరాయిన్ మాత్రలు..
హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో గత కొన్ని రోజులుగా విదేశాల నుండి వస్తున్న వ్యక్తుల వద్ద భారీగా మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. ఇటీవల టాంజానియా దేశస్థుడు జోహెన్బర్గ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. అతడి కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని లగేజీని తనిఖీ చేశారు.. కానీ అతని వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలు కనిపించాలేదు. అతని నడవడిలో తేడా గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా.. హెరాయిన్ మాత్రలను మింగినట్లు తెలపాడు. అతని కడుపు నుండి టేప్ చుట్టిన 108 హెరాయిన్ మాత్రలను వెలికితీశారు. వాటి బరువు సుమారు 1,389 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 11.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, జుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారుల తెలిపారు.