చిలుకూరు బాలాజి దేవాలయంలో 108 ప్రదక్షణలు పునఃప్రారంభం

చిలుకూరు (CLiC2NEWS): చిలుకూరు బాలాజి అంటే గుర్తొచ్చేది గుడి చుట్టూ భక్తుల 108 ప్రదక్షణలతో ఆలయం అంతా ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా భక్తుల ప్రదక్షణలు నిలిపివేసిన విషయం తెలిసినదే. ఆలయంలో ప్రదక్షణలు పునఃప్రారంభిస్తున్నట్లు ఆలయ అర్చకులు మంగళవారం తెలిపారు. ఆలయంలో భక్తులు మహాప్రకార ప్రదక్షణలు (11,108 ప్రదక్షణలు) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.