తెలంగాణలో ఏప్రిల్ 3నుండి టెన్త్ పరీక్షలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 3వ తేదీ ప్రథమ భాష, 4వ తేదీ ద్వితీయ భాష, 6వ తేదీన ఇంగ్లీష్, 8 వ తేదీ మ్యాథ్స్, 10 వ తేదీ సైన్స్, 11న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30వరకు జరుగుతాయి.. కానీ సామన్య శాస్త్రం పరీక్ష మాత్రం 9.30 గంటల నుండి 12.50 వరకు జరుగుతుంది.