అమెరికా నుండి భారత్‌కు మరో 112 మంది వలసదారులు

అమృత్ సర్ (CLiC2NEWS): అమెరికా నుండి అక్రమ వలస దారులను భారత్‌కు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు ట్రంప్.. అక్రమంగా వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు తిరిగి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అమెరికా నుండి మరో 112 వలసదారులను భారత్‌కు పంపింది. ఈ విమానం ఆదివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకుంది. అమెరికా నుండి ఈ నెల 5 నుండి 10 రోజుల వ్యవధిలో 3 విడతలుగా వలసదారులను వెనక్కి పంపింది. ముందుగా 104 మంది భారత్‌కు చేరకున్నారు. అనంతరం రెండో విడతలో మరో 116 మంది.. తాజాగా 112 మంది చేరుకున్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వలస దారులు ఆయా దేశాలకు వెళ్లి పోవాల్సిందేనని ట్రంప్ ఇది వరకే స్పష్టం చేశారు.