1,15,736 కొత్త కేసులు

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు...

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉగ్ర‌రూపం దాలుస్తోంది. మ‌రోసారి రికార్డు స్థాయిలో మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 1,15,736 క‌రోనా కేసులు నమోదయ్యాయి. బుధ‌వారం ఉద‌యం కేంద్రం క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,28,01,785కి చేరింది. వీటిలో 1,17,92,135 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 8,43,473 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 630 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,66,177కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 59,856 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.