ఉచిత బస్సు.. 45 రోజుల్లో 12 కోట్ల మంది ప్రయాణం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం.. ఆర్‌టిసి బస్సుల్లో 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారని ఎండి సజ్జనార్ తెలిపారు. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నామిన.. అపుడు రద్దీ తగ్గే అవకాశముంటుందన్నారు. నాంపల్లిలో జరిగిన బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 వ జయంతి వేడుకలలో సజ్జనార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఆర్‌టిసి బస్సుల్లో వికలాంగుల సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని.. దీంతో వారికి ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలిసిందన్నారు. వికాలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్‌టిసి యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆనౌన్స్‌మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు.