రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 పోస్టులు
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 120 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దరఖాస్తులను ఈ నెల 30 వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ.850 గా నిర్ణయించారు. ఎస్సి/ ఎస్టి/ పిడబ్ల్యుబిడిలకు రూ.100 గా ఉంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు:
ఆఫీసర్ గ్రేడ్ -బి (జనరల్) — 83
ఆఫీసర్ గ్రేడ్ -బి (డిఇపిఆర్) — 17
ఆఫీసర్ గ్రేడ్ -బి (డిఎస్ ఐఎం) — 20
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పిజి ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 01.09.2025 నాటికిఇ 21 నుండి 30 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.78,450 ఉంటుంది.
పరీక్ష తేదీలు
గ్రేడ్ -బి జనరల్ ఫేజ్ -1 పోస్టులకు పరీక్ష తేదీ.. 18.10.2025
గ్రేడ్ -బి (డిఇపిఆర్) పేపర్ -1,2 : 19.10.2025
గ్రేడ్-బి జనరల్ ఫేజ్ -2 : 06.12.2025
గ్రేడ్ -బి (డిఇపిఆర్ ) పేపర్ – 1,2/ (డిఎస్ ఐఎం ) పేపర్ -2,3: 07.12.2025
పూర్తి సమాచారం కొరకు అభ్యర్థులు వెబ్సైట్ https://opportunities.rbi.org.in చూడగలరు.
[…] […]