టిఎస్ఎస్‌పిడిసిఎల్‌లో 1201 పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో విద్యుత్తు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 19వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. జూన్ 17వ తేదీన ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థులు ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స‌బ్ జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల‌కు జూన్ 15వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. జులై 31న రాత ప‌రీక్ష ఉంటుంది. అభ్య‌ర్థులు ఐటిఐలో ఎల‌క్ట్రిక‌ల్ ట్రేడ్‌, వైర్‌మెన్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ట్రేడ్‌లో ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 2022 జ‌న‌వ‌రి 1 నాటికి 18 నుండి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈడ‌బ్లుఎస్ వారికి 5 ఏళ్ల వ‌యోప‌రిమిత‌తి స‌డ‌లింపు ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడ‌గ‌ల‌రు.

  • పోస్టుల వివ‌రాలు:
    1000 జూనియ‌ర్ లైన్‌మెన్ పోస్టులు
    201 స‌బ్ ఇంజ‌నీర్ పోస్టులు
Leave A Reply

Your email address will not be published.