దేవుడి హుండీలో రద్దయిన రూ.2వేల నోట్లు
తెనాలి (CLiC2NEWS) : దేవుడి హుండీలోని కానుకలు లెక్కిస్తుండగా. . రూ.2వేల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని వైకుంఠపురంలో ఉన్న శ్రీవేంటకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. మొత్తం రూ.2.44 లక్షలు (122) నోట్లు ప్రత్యక్షమయ్యాయి. గురువారం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో ఆలయంలోని స్వామివారి హుండీ కానుకలు లెక్కించారు. ఈ క్రమంలో రద్దయిన రూ.2వేల నోట్లు హుండీలో ప్రత్యక్షమవడంతో చర్చనీయాంశమైంది. 2023లో రూ.2వేల నోట్లు రద్దయిన సంగతి తెలిసిందే.