నగర నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దేశంలోనే అతిపెద్ అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మించారు. అదే విధంగా 11.34 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతి వనం అభివృద్థి కూడా కొనసాగుతుంది.
షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ ఆధ్వార్యంలో.. రూ. 146.50 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నొయిడా డిజైన్ అసోసియేట్స్‌కు విగ్రహ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. పూర్తిగా దేశీయంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహం.. పీఠం ఎత్తు 50 అడుగులతో కలుపుకొని మొత్తం 175 అడుగుల ఎత్తుంటుంది.
పార్లమెంట్ తరహాలో స్మారక భవనం.. 2,476 చదరపు అడుగుల విస్తార్ణంలో.. వృత్తాకారంలో, భారీ ఎత్తు పిల్లర్లతో భవనాన్ని నిర్మించారు. ఇది చూడడానికి పార్లమెంట్ భవనం మాదిరిగానే ఉంటుంది.