యాదాద్రిలో విమాన గోపురానికి 125 కేజీల‌ బంగారంతో తాపడం

హైదరాబాద్ (CLiC2NEWS): యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌య విమానగోపురానికి బంగారు తాపడం చేయిస్తున్నామని ముఖ్య‌మంత్రి కెసిఆర్ వెల్లడించారు. మంగళవారం యాదాద్రి లో ప‌ర్య‌టించిన సిఎం కెసిఆర్‌.. సాయంత్రం అక్క‌డ మీడియాతో మాట్లాడారు… స్వామివారి గర్భగుడిపైన ఉండే విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు. దీనికోసం తిరుమలలో చేసిన వారిని మన అధికారులు సంప్రదించారు. దానికి వారు స్పందిస్తూ.. తమకు కొంత సమయం పడుతుందని చెప్పార‌ని పేర్కొనారు. దానికి వారు వేసిన బంగారం అంచనా. 125 కిలోలు అని సిఎం తెలిపారు.

డబ్బు రూపంలో దాని విలువ చూస్తే రూ.60 కోట్ల దాకా అవుతుందని పేర్కొన్నారు. కాగా కానీ, ఇటీవల శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ ప్రస్తావన తెచ్చాన‌ని తెలిపారు. దానికి ‘యావత్‌ తెలంగాణ ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవాలనుకుంటరు. ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని ఇన్వాల్వ్‌ చేద్దాం’ అన్నరు. ప్రజలందరు తమదిగా భావించి, ఒక ఎమోషన్‌లో కదిలి వచ్చే ప్రయత్నం చేద్దామన్నరు.

కలిగిన వారు కలిగినంత ఇంత ఎక్కువ, తక్కువ అని లేదని సిఎం “మనకు 12,769 గ్రామ పంచాయతీలు, 3,600 పైచిలుకు మున్సిపల్‌ వార్డులు ఉన్నాయి. 142 మున్సిపాలిటీలు, హైదరాబాద్‌ వంటి మహానగరం ఉంది. మన వాళ్లు కోరింది ఏంటంటే.. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చేతనైంత వాళ్లు సమర్పించాలి. వీసమెత్తో, గుంజెత్తో.. పావుతులం అయినా ఫర్వాలేదు వాళ్లను ఇన్వాల్వ్‌ చేయాలి. వాళ్ల వాళ్ల గ్రామాల్లో నృసింహ పూజ కార్యక్రమాలు చేసి డబ్బు రూపంలో తెచ్చి కమిటీ వారికి అప్పజెప్పాలి. ఈ బంగారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి కొనాలని నిర్ణయించాం. కమిటీ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. తిరుమలలో ఎలా చేసుకున్నమో మనం అలా చేసుకున్నైట్లెతే అది శాశ్వతంగా, గొప్పగా ఉండిపోయే అవకాశం ఉంటుంది’ అని ముఖ్య‌మంత్రి చెప్పారు.

మా కుటుంబం నుంచి కిలో 16 తులాలు: సిఎం

ఈ కార్య‌క్ర‌మంలో మొట్టమొదటి విరాళం అందించే కార్యకర్తగా ఒక కిలో 16 తులాల బంగారం మా కుటుంబం నుంచి సమకూర్చాలని నిర్ణయించాను అని సిఎం తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముందుకు వచ్చి తన కుటుంబం నుంచి ఒక కిలో, మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారాన్ని సమర్పిస్తామని ప్రకటించారని సిఎం తెలిపారు.

అలాగే యాదాద్రిలో డ్రైనేజీ వ్యవస్థ కూడా అవసరం. రేపు, ఎల్లుండి జలమండలి అధికారులను ఇక్కడికి పంపిస్తామ‌ని తెలిపారు.టెంపుల్‌ సిటీ, పాత గుట్ట, యాదాద్రి మున్సిపల్‌ పరిధి, స్వామి వారు ఉండే పుణ్యక్షేత్రం అంతటా అండర్‌ డ్రైనేజీ విధానం, వరద నీరు పోవడానికి డ్రైనేజీలను నిర్మించాల్సి ఉంటుందని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.