సీడాక్, చెన్నైలో 125 పోస్టులు
CDAC: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్), చెన్నైలో 125 ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు ఇంజినీర్, ప్రాజెక్టు టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను డిసెంబర్ 5వ తేదీలోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు లేదు. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముందుగా అభ్యర్థులను ఏడాది కాలానికి ఎంపిక చేస్తారు. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ , ఐఒటి, ఎంబెడెడ్ సిస్టమ్స్ , సైబర్ సెక్యూరిటి, నెట్‌వర్క్ సెక్యూరిటి, డిజైన్, వెబ్ డిజైనింగ్, యుఐఅండ్ యుఎక్స్ డిజైనర్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, మెషిన్ లెర్నింగ్, సాప్ట్‌వేర్ టెక్నాలిజి (వెబ్ టెక్నాలజి). డేటా సైన్స్, కమ్యూనికేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, పుల్ స్టాక్ డెవలపర్, వెబ్ డెవలపర్, టెక్నికల్ సపోర్ట్ , నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, టెస్టింగ్/ క్యుఎ, డీప్ లెర్నింగ్, డిపెండబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ (సైబర్ సెక్యూరిటి), ఎంబెడ్ సిస్టమ్స్ అండ్ ఐఒటి విభాగాల్లో మూడు పోస్టులకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి.
ప్రాజెక్టు ఇంజినీర్/ పిఎస్ అండ్ ఒ ఎగ్జిక్యూటివ్ (ఎక్స్‌పీరియెన్స్‌డ్)-50
అర్హత : బిఇ/ బిటెక్, ఎంఇ/ ఎంటెక్, పిజి ( సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్) , పిహెచ్‌డి, అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు.
ప్రాజెక్టు అసోసియేట్ (ఫ్రషర్)-30
అర్హత బిఇ/ బిటెక్, ఎంఇ/ ఎంటెక్, పిజి ( సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్) వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి
ప్రాజెక్ట్ / ప్రోగామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరి మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్‌నర్-5
అర్హత : : బిఇ/ బిటెక్, ఎంఇ/ ఎంటెక్, పిజి ( సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్) , పిహెచ్‌డి
ఐటి, ఐటి ఆపరేషన్స్ , సర్వర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, టెక్నికల్ హెల్ప్ డెస్క్, టెక్నికల్ సపోర్ట్ , టెక్నికల్/ ఫంక్షనల్, లినక్స్ అడ్మినిస్ట్రేషన్, నెట్ వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటి, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మిన్ మొదలైన విభాగాల్లో ఈ క్రింది పోస్టులు కలవు.
ప్రాజెక్ట్ టెక్నీషియన్ 20
అర్హత : ఐటిఐ/ మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ / డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ / ఐటి / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ అప్లికేషన్ ) . ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి.
సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్/ మోడ్యూల్ లీడ్/ ప్రాజెక్టు లీడర్- 20
అర్హత : బిఇ/ బిటెక్, ఎంఇ/ ఎంటెక్, పిజి ( సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్) , పిహెచ్‌డి .. అభ్యర్థలు వయస్సు 40 ఏళ్లకు మించకూడదు.