దేశంలో కొత్త‌గా 12,516 కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజా బులెటిన్‌ ప్రకారం కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 11,65,286 నామూనాల‌ను పరీక్షించగా 12,516 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులెటిన్ ను విడుద‌ల చేసింది.

  • తాజాగా గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో మరో 267 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.
  • తాజాగా గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 13,155 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
  • తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.44కు చేరింది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు తాజా రిక‌వ‌రీల‌తో క‌లిపి దేశంలో 3.38 కోట్ల మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
  • ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,37,416 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
  • తాజాగా గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 501 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.
Leave A Reply

Your email address will not be published.