అమరీందర్‌కు సలహాదారుగా ప్రశాంత్‌ కిషోర్‌

చంఢీగర్: 2022లో పంజాబ్‌లో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. దీనిలో భాగంగా వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను ప్రిన్సిపల్‌ అడ్వయిజర్‌గా సోమవారం నియమించుకున్నారు. 2017 ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ క్రీయాశీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రశాంత్‌ కిషోర్‌ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో టిఎంసి కోసం పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు ముగిసిన తరువాత పంజాబ్‌పై దృష్టి పెడతారని భావిస్తున్నారు.

కాగా ఈ విషయాన్ని సీఎం కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్‌ కిషోర్‌ నాకు ప్రధాన సలహాదారుగా నియమితులవడం చాలా సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం తాము ఇద్దరు కలిసి పనిచేయడానికి ఎదురు చేస్తున్నా’ అని ఆయన తెలిపారు.

ప్రశాంత్‌ కిషోర్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పంజాబ్‌ మంత్రి మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కేబినెట్‌ ర్యాంక్‌తో సమానం. మంత్రి మండలి విడుదల చేసిన నియామక నోటిఫికేషన్‌లో ఆయన ఈ పదవిలో జీతంగా రూ.1 మాత్రమే తీసుకోనున్నట్లు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.