హైదరాబాద్లో యువతి ఆత్మహత్య!
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని గంధంగూడ వీకర్ సెక్షన్ కాలనీలో సోమవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన దివ్య అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నానాల గదిలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు బయట నుంచి వచ్చేలోగా శరీరం పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. విషయం తెలసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.