తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీల‌కు 13 జాతీయ పుర‌స్కారాలు

ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రంలోని 13 పంచాయ‌తీలు జాతీయ పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్నాయి. దేశ‌వ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి ప‌నితీరు క‌న‌బ‌ర్చిన గ్రామ పంచాయ‌తీల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో ఈ పుర‌స్కారాల‌ను రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పంచాయ‌తీ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో పాటు ఆయా గ్రామాల స‌ర్పంచ్‌లు, ఎంపిపిలు, జ‌డ్‌పి ఛైర్‌ప‌ర్స‌న్‌లు అందుకున్నారు. దేశం మొత్తం మీద 46 గ్రామ పంచాయ‌తీల‌కు అవార్డులు రాగా.. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే 13 అవార్డులు ద‌క్కాయి.
గ్రామ పంచాయ‌తీల‌కు దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ పంచాయ‌త్ స‌త‌త్ వికాస్ పుర‌స్కార్ 2023, నానాజీ దేశ్‌ముఖ్ స‌ర్కోత్త‌మ్ పంచాయ‌త్ స‌త‌త్ వికాస్ ప‌రుస్కార్‌-2023 పేరుతో అవార్డులు అంద‌జేశారు.

గ్రామ పంచాయ‌తీల‌కు దీన్ ద‌యాల్ ఉపాధ్యాయ పంచాయ‌త్ స‌త‌త్ వికాస్ పుర‌స్కార్ – 2023

గ్రామ పంచాయితీ – జిల్లా – విభాగం

గౌతంపూర్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా -ఆరోగ్య పంచాయితీ
నెల్లుట్ల జ‌న‌గామ జిల్లా- స‌మృద్దిగా మంచినీరు అందుబాటు గ‌ల గ్రామం
కొంగ‌ట్ ప‌ల్లి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌- సామాజిక భ‌ద్ర‌త గ‌ల గ్రామం
అయిపూర్‌, సూర్యాపేట – స్నేహ‌పూర్వ‌క మ‌హిళా గ్రామం
మందొండి, గ‌ద్వాల జిల్లా – పేద‌రిక నిర్మూల‌న, జీవ‌నోపాదులు పెంచిన గ్రామం
చీమ‌ల్ దారి , వికారాబాద్ – సుప‌రిపాల‌న గ్రామం
సుల్తాన్‌పూర్‌, పెద్దప‌ల్లి జిల్లా – క్లీన్ అండ్ గ్రీన్
గంభీరావు పేట , సిరిసిల్లా – స్వ‌యం స‌మృద్ధి, మౌలిక స‌దుపాయాల విభాగం

 

నానాజీ దేశ్‌ముఖ్ స‌ర్కోత్త‌మ్ పంచాయ‌త్ స‌త‌త్ వికాస్ ప‌రుస్కార్‌-2023 పేరుతో అవార్డులు అంద‌జేశారు.

గ్రామ పంచాయితీ – జిల్లా – విభాగం

తిమ్మాపూర్ ఎల్ ఎండి, క‌రీంన‌గ‌ర్ జిల్లా-  ఉత్త‌మ బ్లాక్ (మండ‌లం)

ములుగు- ఉత్త‌మ జిల్లా ప‌రిష‌త్

ముఖ‌రా కె గ్రామం, ఆదిలాబాద్  -స్పెష‌ల్ కేట‌గిరి

నందిగామ మండ‌లం క‌న్హా గ్రామం – కార్బ‌న్ న్యూట్ర‌ల్ విశ్‌ష్ పంచాయ‌తీ

మార్కూక్ ఎర్ర‌వెల్లి, సిద్దిపేట – నాన్ ఫైనాన్షియ‌ల్ ఇన్సెంటివ్ స‌ర్టిఫికెట్ల విభాగం

Leave A Reply

Your email address will not be published.