విషాదం.. పిడుగుపాటుతో 13 మంది మృతి

పట్నా (CLIC2NEWS): బిహార్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బెగూసరాయ్, దర్‌బంగా, మధుబని జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 2023లో పిడుగుపాటు కారణంగా బిహార్‌లో 275మంది ప్రాణాలు కోల్పోయారు.