జల్‌బోర్డులో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

సివిల్ ఇంజినీర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఢిల్లీలోని ఢిల్లీ జల్ బోర్డ్ లో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 131 . ఈ జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన భర్తీచేయనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్తులకు నెలకు వేతనం రూ.54,162 ఉంటుంది. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా కాని ఈ నెల 15వ తేదీ లోపు పంపించాలి.
దరఖాస్తులను ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ , రూం. నెం.202 , ఢిల్లీ జల్ బోరడ్, వరుణాలయ ఫేఫజ్2, కరోల్ భాగ్, న్యూఢిల్లీ అనే చిరునామాకు పంపించాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://delhijalboard.delhi.gov.in/recruitment వైబ్‌సైట్ చూడగలరు.