గుజ‌రాత్‌లోని తీగ‌ల వంతెన ఘ‌ట‌న‌.. 132కి చేరిన మృతుల సంఖ్య‌

అహ్మ‌దాబాద్‌ (CLiC2NEWS): గుజ‌రాత్‌లోని మోర్బీ ప‌ట్ట‌ణంలోని మ‌చ్చు న‌దిపై తీగ‌ల వంతెన ఆదివారం కూలిన విష‌యం తెలిసిన‌దే. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 132కి చేరింది. తీగ‌ల వంతెన సామ‌ర్థ్యానికి మించి సంద‌ర్శ‌కులు ఎక్కువ‌వ‌డంతో వంతెన కూలిపోయింది. పైగా కొంద‌రి ఆక‌తాయి చేష్ట‌లు ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కు 177 మందిని ర‌క్షించారు. మృతదేహాల కోసం గాలింపు చ‌ర్యలు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ద‌ర్ఘ‌ట‌న‌లో బిజెపి ఎంపి సోద‌రి కుటుంబ స‌భ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్ర హోంశాఖ మంత్రి హ‌ర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న‌వారిపై క్రిమిన‌ల్ కేసును న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంనాటి ఈ తీగ‌ల వంతెనకు సుమారు 7 నెల‌ల పాటు మ‌ర్మమ‌తులు నిర్వ‌హించి.. తిరిగి ఈ నెల 26వ తేదీన ప్రారంభించారు. ఆదివారం సెల‌వుదినం కావ‌డంతో సంద‌ర్శ‌కుల ర‌ద్దీ ఎక్కువై వంతెన‌పైకి వంద‌ల మంది చేర‌డంతో వంతెన ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ఈప్ర‌మాదానికి సంబంధించిన సిసిటివి పుటేజీలు వెలుగులోకి వ‌చ్చాయి.

గుజ‌రాత్‌లో తీగ‌ల వంతెన కూలి.. 60 మంది మృతి

Leave A Reply

Your email address will not be published.