దేశంలో కొత్తగా 13,315 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా దేశంలో 13,615 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్యం 4,36,52, 944 కు చేరింది. తాజాగా 13,265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంఓ 4,29,96,427 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 20 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు.