ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్..

ఢిల్లీ (CLiC2NEWS): మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడికి పంపాలని ఇడి తరపు న్యాయవాది జోయర్ హుస్సేన్ కోరారు. ఇడి కస్టడి నేటితో ముగియనుండటంతో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యాల్ విడుదల అయ్యిదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్పై వచ్చేనెల 1వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆమెను తిహాడ్ జైలుకు అధికారులు పంపనున్నట్లు సమాచారం.