త్వరలో వైద్య కళాశాలల్లో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ: హరీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో 1400 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నగరంలోని పాతబస్తీలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో సోమవారం ఇన్‌ఫెక్షన్ల నివారణ-అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. మాతా శిశు మరణాల విషయంలో రాష్ట్రం చాలా మెరుగైందన్నారు. రాష్ట్రంలో మాతా శిశుసంరక్షణ ఆస్పత్రులను పెంచున్నట్లు తెలిపారు. త్వరలో మెడికల్ కాలేజీల్లో 1400 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీ వలన రాష్ట్రంలోని వైద్యసేవలు మరింత మెరుగవుతాయని వివరించారు. నిమ్స్‌లో 250 పడకలు, గాంధీలో 200 పడకలతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎంసిహెచ్) తీసుకొస్తామని తెలిపారు.