దేశంలో కొత్తగా 14,146 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- ఇప్పటి వరకు దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 3,40,67,719కు చేరింది.
- ఇప్పటి వరకు దేశంలో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
- కరోనా తో ఇప్పటి వరకు దేశంలో 4,52,124 మంది మరణించారు.
- గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- గత 24 గంటల్లో కొత్తగా 144 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 41,20,772 మందికి వ్యాక్సిన్ వేశారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 97,65,89,540 కరోనా డోసులను పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.