గోదావ‌రి ఉగ్ర‌రూపం.. భ‌ద్రాచ‌లం, బూర్గంపాడులో 144 సెక్ష‌న్‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం (CLiC2NEWS): గోదావ‌రి న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద ప్ర‌మాద‌క స్థాయిలో నీటి మ‌ట్టం పెరుగుతోంది. అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లుచేప‌ట్టారు. భ‌ద్రాచ‌లం, బూర్గంపాడు మండ‌లాల్లో 144 సెక్ష‌న్ విధించారు. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అనుదీప్ ఆదేశించారు. భ‌ద్రాచ‌లం బ్రిడ్జిపై నుంచి గురువారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాక‌పోక‌లు నిలిపివేస్తున్నామ‌ని చెప్పారు. వ‌ర‌ద ముంపు దృష్ట్యా వంతెన‌పై రెండు రోజుల పాటు రాక‌పోక‌లు ఆపేస్తున్నామ‌ని వెల్లడించారు. గురువారం మ‌ధ్యాహ్నానికి న‌దిలో నీటిమ‌ట్టం 60.30 అడుగుల‌కు చేరడంతో స‌మీపంలో లోత‌ట్టు కాల‌నీల‌ను వ‌ర‌ద ముంచెత్తింది. సుభాష్‌న‌గ‌ర్‌, రామాల‌యం ప‌రిస‌రాలు, అయ్య‌ప్ప కాల‌నీ, కొత్త కాల‌నీ వంటి ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. గోదావ‌రి నీటి మ‌ట్ట ం66 నుంచి 70 అడుగుల మేర చేరుతుంద‌ని అంచ‌నాతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ భ‌ద్రాచ‌లంలోనే మ‌కాం వేసి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.