బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. ఒప్పం ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించాల్సి ఉంది. దరఖాస్తు రుసుం రూ.600.. ఎస్‌సి , ఎస్‌టి , పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు రూ.100
పోస్టుల వివరాలు
డిప్యూటి డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (డిడిబిఎ) – 1
ఈ పోస్టుకు 57 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏడాదికి రూ.18లక్షల వేతనం ఉంటుంది.
ప్రైవేటు బ్యాంకర్ – రేడియన్స్ ప్రైవేట్ -3
ఈ పోస్టుకు 33 నుండి 50 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలి. ఏడాదికి వేతనం రూ. 14 లక్షల నుండి 25 లక్షల జీతం అందుతుంది.
గ్రూప్ హెడ్ -4
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 31 నుండి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి ఏడిదికి రూ.16లక్షల నుండి రూ.28 లక్షలు వరకు వేతనం అందుతుంది.
టెరిటోరి హెడ్- 17
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 27 నుండి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి ఏడిదికి రూ.14లక్షల నుండి రూ.25 లక్షలు వరకు వేతనం అందుతుంది.
సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ -101
అభ్యర్థుల వయస్సు..24 నుండి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి ఏడిదికి రూ.8లక్షల నుండి రూ.14 లక్షలు వరకు వేతనం అందుతుంది.
వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్సూరెన్స్ ) -18
అభ్యర్థుల వయస్సు..24 నుండి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి ఏడిదికి రూ.12 లక్షల నుండి రూ.20 లక్షలు వరకు వేతనం అందుతుంది.
ప్రొడక్ట్ హెడ్- ప్రైవేట్ బ్యాంకింగ్ -1
వయస్సు..24 నుండి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి ఏడిదికి రూ.10 లక్షల నుండి రూ.16 లక్షలు వరకు వేతనం అందుతుంది.
పోర్ట్ పోలియో రిసెర్చ్ అనలిస్ట్ -1
వయస్సు..22 నుండి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి ఏడిదికి రూ.6లక్షలు వరకు వేతనం అందుతుంది.
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రి, పిజి ఉత్తీర్ణత.. పని అనుభవం ఉండాలి.