శంషాబాద్ విమానాశ్ర‌యంలో 15 కిలోల బంగారం ప‌ట్టివేత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని షూలో అమ‌ర్చి అక్ర‌మంగా బంగారాన్ని త‌ర‌లిసిస్తున్న వారిని శంషాబాద్ విమానాశ్ర‌యంలో క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 23 మంది ప్ర‌యాణికులు షూ కింద ప్ర‌త్యేకమైన ఏర్పాట్లు చేసుకొని త‌ర‌లిస్తాన్నారు. సుమారు 15 కిలోల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఈ మ‌ధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న బంగారంలో ఇదే అత్య‌ధిక‌మ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.