అమ‌ర‌నాథ్ లో వ‌ర‌ద‌ల్లో 15 మంది మృతి

అమ‌ర్‌నాథ్ (CLiC2NEWS): అమ‌ర్‌నాథ్ లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ వ‌ర‌ద‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది యాత్రికులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. ఒక్క సారిగా గుహ ప‌రిస‌రాల్లోకి వ‌ర‌ద వ‌చ్చిప‌డ‌టంతో అందుల్లో చిక్కుకున్న 16 మంది యాత్రికులు మృతి చెందారు. మ‌రో 40 మందికి పైగా యాత్రికులు గ‌ల్లంతు అయి ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించామ‌ని జ‌మ్మూకాశ్మీర్ ఐజిపి చెప్పారు. గల్లంత‌యిన వారికోసం ఎన్డీఆర్ ఎఫ్, ఎస్‌డిఆర్ ఎఫ్ బృందాలు ముమ్మ‌రంగా స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ప‌లువురు బాధితుల‌ను హెలికాప్ట‌ర్ల ద్వారా త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఘ‌ట‌నా స్థ‌ల ప‌రిస‌రాల్లో భారీ వ‌ర్షం కురుస్తుండ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌లకు కొంత మేర ఆంట‌కం ఏర్ప‌డింది. వ‌ర‌ద‌ల దృష్ట్యా అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. జ‌మ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హాతో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. బాధితుల‌కు కేంద్రం అండ‌గా ఉంటుందని మోడీ భ‌రోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.