పల్నాడు జిల్లాలోని గురుకుల పాఠశాలలో 150 మంది విద్యార్థులకు అస్వస్థత
సత్తెనపల్లి (CLiC2NEWS): పల్నాడు జిల్లాలోని రామకృష్ణాపురం డా. బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్తతకు గురయ్యారు. ఉదయం కలుషిత అల్పాహారం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. మధ్యాహ్నం భోజనం తర్వాత మరికొంత మంది అస్వస్థతకు గురవడంతో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అప్రమత్తమయి విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సుమారు 150 మంది విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పాఠశాలలో మొత్తం 640 మంది విద్యార్థినులు ఉన్నారు.