1500 హమాస్ ఉగ్రవాదులు మృతి.. ఇజ్రాయిల్ వెల్లడి!

జెరూసలెం (CLiC2NEWS): హహాస్ మిలిటెంట్ల దాడికీ ధీటుగా ఇజ్రాయిల్ సైన్యం ప్రతిదాడికి దిగి ఉగ్రవాదులను ఏరిపారేస్తుంది. దాదాపు 1500 హమాస్ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయిల్ సరిహద్దుల్లో శనివారం.. హమాస్ మిలిటెంట్లు వేల రాకెట్లతో ఇజ్రాయిల్‌పై మెరుపుదాడికి దిగిన సంగంతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయిల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న ఇజ్రాయిల్ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్లు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపంది. అంతేకాకుండా దక్షిణ ఇజ్రాయిల్ లో హమాస్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి తమ అధీనంలో తెచ్చుకున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ అధికారి వెల్లడించారు.
ఇజ్రాయెల్ సుమారు 3లక్షల మంది సైన్యాన్ని సమీకరించి హమాస్‌పై దాడికి సిద్ధమైంది. ఇతర దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ సైనికులు సైతం మాతృభూమికి పయనమైయ్యారు. 35 బెటాలియన్లను గాజా సరిహద్దులకు తరలించినట్లు సమాచారం.
[…] 1500 హమాస్ ఉగ్రవాదులు మృతి.. ఇజ్రాయిల్… […]