తెలంగాణలో 1,500 పల్లె దవాఖానాలు : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన శుక్రవారం పిహెచ్‌సిల పనితీరును అనుక్షణం పరశీలించే విధంగా మనిటరింగ్ హబ్‌ను ప్రారంభించారు. ప్రజారోగ్య సంచాలకుల (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) కార్యాలయంలో దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో హబ్ ఏర్పాటు చేయటం జరింగింది. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు డిహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు వైద్యసదుపాయాలు అందించడానికి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని అన్నారు. మెడికల్ కాళాశాలలు, జిల్లా హాస్పిటల్‌తో సంప్రదించి స్పెషాలిటి సేవలు అందించే అవకాశం ఉంటుదన్నారు. సిసి కెమెరాలతో సెక్యూరిటి, సేఫ్టీ ఉంటుందని.. ఇది దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. మునుగోడు ఎన్నికత కారణంగా డాక్టర్ల నియామకాల ప్రక్రియ ఆలస్యమయిందని.. 969 పోస్టులకు మెరిట్ లిస్ట్ ప్రకటించినట్లు తెలిపారు. రెండు, మూడు వారాల్లో నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఇక అన్ని పిహెచ్‌సిలలో వైద్యులు ఉంటారని, పల్లె దవాఖాలనాల కోసం 1,569 డాక్టర్ల పోస్టుల నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభమవుతుందన్నారు.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.