16.8 కోట్ల మంది వ్య‌క్తిగ‌త డేటా చోరీ.. అమ్మ‌కానికి పెట్టిన ఆరుగురు అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌లు ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుండి డేటాను చోరీ చేసి సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు అమ్ముతున్న ముఠాను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ‌వ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్య‌క్తి గ‌త డేటాను చేరి చేసి అమ్ముతున్న ఆరుగురిని అరెస్టు చేసిన‌ట్లు సిపి స్టీఫ‌శ్రీ‌న్ ర‌వీంద్ర మీడియాకు వివ‌రించారు. బ్యాంక్ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్‌, పాల‌సీ బ‌జార్, పాన్ ఇండియా ప్ర‌భుత్వ ఉద్యోగులు, వంటి పేరున్న సంస్థ‌ల నుండి డేటా చోరీ అయిన‌ట్లు తెలిపారు. ఫేస్‌బుక్ యూజ‌ర్ల ఐడి, పాస్‌వ‌ర్డ్‌లు, ఐటి ఉద్యోగుల డేటా, డిఫెన్స్‌, ఆర్మీ ఉద్యోగుల డేటా సైతం చోరీ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.బీమా రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వ్య‌క్తుల స‌మాచారం చోరీకి గు‌రైన‌ట్లు గుర్తించారు. దీని వెనుక ఎవ‌రున్నారు.. ముఖ్య‌మైన స‌మాచారం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది.. డేటా ఎంత‌వ‌ర‌కు దుర్వినియోగం అయ్యింది అనే అంశాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.