Suryapet: కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దుల మృత్యువాత..
16 bulls died due to suffocation in the container.

సూర్యాపేట (CLiC2NEWS): ఓ భారీ కంటైనర్‌లో 16 ఎద్దులు ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌ను పోలీసులు గుర్తించారు. ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ సూర్యాపేట నుండి ఎపి వైపు వెళ్తుంది. నలుగురు తమిళనాడు వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్‌లో 16 ఎద్దులు ఊపిరాడక మృతి చెందగా.. మరో తొమ్మిందింటిని గోశాలకు తరలించారు. ఒక ఎద్దుకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.