16 నుంచి ఆఫ్ లైన్లో పూర్తి స్థాయిలో పాఠశాలు

మంత్రి ఆదిమూలపు సురేష్

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆగ‌స్టు 16న తేదీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ వెల్ల‌డించారు. ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని తెలిపిన ఆయన, ఎప్పటి మాదిరే రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని వెల్లడించారు.

“కొవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 % మంది ఉపాధ్యాయుల‌కు వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు.” అని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే ప్ర‌యివేటు పాఠ‌శాలల్లో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించొద్ద‌ని ఆదేశాలు జారీచేసిన‌ట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠ‌శాలల‌ను నిర్వ‌హిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.