కృష్ణా జిల్లాలో 164 పారా మెడిక‌ల్ ఉద్యోగాలు.. రేపే చివ‌రి తేదీ

మ‌చిలీప‌ట్నంలోని ఆరోగ్య‌, వైద్య‌, కుటుంబ సంక్షేమ శాఖ
164 పారా మెడిక‌ల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌ను జిఎంసి, జిజిహెచ్‌, ప్ర‌భుత్వ న‌ర్సింగ్ కాలేజీల‌లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు. అభ్య‌ర్థుల ఎంపిక అక‌డ‌మిక్ మార్కులు, ప‌ని అనుభ‌వం, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్‌లో ప్రిన్సిపల్‌, జిఎంసి, జిజిహెచ్, కార్యాల‌యం, మ‌చిలీప‌ట్నం అడ్ర‌స్‌కు అంద‌జేయాలి.

పోస్టుల వివ‌రాలు

ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఫార్మాసిస్ట్‌, కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్‌, ఆఫీస్ స‌మార్డినేట్స్‌, జ‌న‌ర‌ల్ డ్యూటీ అటెండెంట్స్‌, మార్చురీ అటెండెండ్‌, స్టోర్ కీప‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ హెల్ప‌ర్‌, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ట్రైన‌ర్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ స్టెనో పోస్టులు క‌ల‌వు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌య‌స్సు 42 సంవ‌త్సరాల లోపు ఉండాలి. పోస్టును బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటిఐ, డిప్లొమా, పిజి, డిప్లోమా, డీ ఫార్మ‌సి, బి పార్మ‌సి, బిఎస్‌సి, డిగ్రీ, పిజి ఉత్తీర్ణులై ఉండాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ నవంబ‌ర్ 11, 25వ తేదీన తుది ఎంపిక ఉంటుంది. 27న కౌన్సెలింగ్‌, పోస్టింగ్ జారీ ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు www://krishna.ap.gov.in/

Leave A Reply

Your email address will not be published.