ఐటి అధికారులమని.. బంగారం దుకాణంలో చోరీ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/robbery-in-gold-shop.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఐటి అధికారలమని.. బంగారం దుకాణంలో అవకతవకలు జరిగాయని.. దుండగులు నగరంలోని సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని ఓ బంగారం దుకాణంలో చోరీచేశారు. పనివాళ్లను బందించి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపాయారు. చోరీకి యత్నించిన నిందితులు జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌లను నలుగురును పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చోరీ చేసిన అనంతరం నిందితులు మహారాష్ట్రకు పారిపోయారని, అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలోని ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో నిందితులు 24వ తేదీన రెండు బృందాలుగా ఏర్పడి రూమ్ బుక్ చేసుకున్నారు. ఆధార్ కార్డుల జిరాక్స్ లేవని వాట్సాప్ చేశారు. హోటల్ యజమాని వాటిని ప్రింట్ తీయకుండా అశ్రద్ధ చేయగా.. రెండో రోజు వాటిని నిందితులు డిలిట్ చేశారు. 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిందుతలలో ఒకరు తల్లి చనిపోయిందని, వెంటనే రూమ్ ఖాళీ చేశారు. లాడ్జ్‌కు 750 మీటర్ల దూరంలోనే చోరీ జరిగిన దుకాణం ఉంది. పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారని .. పరారీలో ఉన్న నలుగురు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.