నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 171 పోస్టులు
NLC: తమిళనాడులో ఉన్న నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ ఎల్‌సి) లో 171 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది.
జూనియర్ ఓవర్‌మ్యాన్ (ట్రెయినీ)- 69
మైనింగ్ డిప్లొమా/ మైనింగ్ ఇంజినీర్ / తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఓవర్ మ్యాన్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.31వేల నుండి రూ. లక్ష వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు జూనియర్ ఓవర్ మ్యాన్ పోస్టుకు జనరల్ అభ్యర్థులకు రూ.595.. ఎస్‌సి/ ఎస్టి అభ్యర్థులు , మాజి సైనికోద్యోగులకు రూ. 295 గా నిర్ణయించారు.
మైనింగ్ సర్దార్ – 102
మైనింగ్ ఇంజినీరింగ్ కాకుండా ఏదైనా సబ్జెక్టుతో డిప్లొమా/ డిగ్రీ. మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ , ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేదా ఓవర్ న్యూస్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌తో మైనింగ్ డిప్లొమా , ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 26వేల నుండి రూ.1,10,000 వరకు ఉంటుంది.
- అభ్యర్థులు డిప్లొమా/ డిగ్రీని జనరల్ అభ్యర్థులు 60 శాతం .. ఎస్సి, ఎస్టి అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఫీజు వివరాలు.. జనరల్ అభ్యర్థులు రూ.486చెల్లించాల్సి ఉంది. ఎస్‌సి/ ఎస్‌టి, మాజి సైనికోద్యోగులు రూ236 చెల్లించాలి.
- రాత పరీక్షకు హాజరయ్యే ఎస్‌సి/ ఎస్‌టి అభ్యర్థులకు స్లీపర్‌క్లాస్ ట్రైన్ ఛార్జీలు చెల్లిస్తారు.
- వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్‌సి / ఎస్టిలకు ఐదేళ్లు, ఒబిసి లకు మూడేళ్లు , మాజి సైనికోద్యోగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. సంస్థ ఉద్యోగులకు గరిష్ట వయసు నిబంధన లేదు.
రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన , వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను వచ్చే నెల 14వ తేదీ (14.05.2025) లోపు పంపించాల్సి ఉంది.
అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.nlcindia.in/website/en/ వెబ్‌సైట్ చూడగలరు.