18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వండి..
ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసిన ఐఎంఎ
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని భారత వైద్య మండలి (ఐఎంఎ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖరాసింది. టీకాలు కొవిడ్ తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్మూనిటీకి దోహదం చేస్తాయంటూ ఆ లేఖలో టీకా అవసరాన్ని వెల్లడించింది.
దేశంలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందని, అందుకే యుద్ధ ప్రాతిపదికను టీకాలు ఇవ్వాలని కోరింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు తమ యంత్రాంగం మొత్తం నిర్విరామంగా కృషి చేస్తుందని, అందుకే 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఐఎంఏ సూచన చేసింది. అలాగే `ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చిన వారికి టీకా పంపిణీ చేయాలని` అంటూ ఐఎంఎ ఆ లేఖ కొన్ని సూచనలు ప్రధానికి విన్నవించింది.

బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను తప్పనిసరి చేయాలని కోరారు.` కరోనా టీకా పంపిణీ వ్యక్తిగత రోగనిరోధక శక్తిని పెంచి, కేసుల సంఖ్యను పరిమితం చేస్తుంది. వ్యాధి తీవ్రతను తగ్గించి, హెర్డ్ ఇమ్మూనిటీని పెంచేందుకు టీకీ ఒకటే మార్గం` అని టీకాలు అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కరోనా వైరస్ ప్రసార గోలుసను విచ్ఛిన్నం చేసేందుకు పరిమిత కాలం నిరంతంర లాక్‌డౌన్లను విధించాలని తెలిపింది.
Press Release 06.04.2021 pic.twitter.com/oeLDaiIYIO
— Indian Medical Association (@IMAIndiaOrg) April 6, 2021