ఎపిలో 1,831 కొవిడ్ కేసులు నమోదు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చితే మంగళవారం పాజిటివ్ కేసుల సంఖ్య రెండింతలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 36,452 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. తాజాగా 1,831 పాజిటివ్ గా నిర్థారణయ్యాయి. ఒక్కరోజులో 242 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.