యుఎస్ ఓపెన్-2022 టైటిల్ విజేత 19 ఏళ్ల అల్కరాజ్..
రఫెల్‌నాదల్ రికార్డును సమం చేసిన స్పెయిన్ యువకెరటం
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/us-open-2022.jpg)
న్యూయార్క్ (CLiC2NEWS): 19 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాజ్ యుఎస్ ఓపెన్ టైటిల్ బరిలో నిలిచి విజయం సాధించాడు. అల్కరాజ్ 6-4, 2-6, 7-1(7-6), 6-3 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొందాడు. కార్లోస్ అల్కరాజ్ అతిపిన్న వయసు ఆటగాడుగా రపేల్ నాదల్ (గ్రాండ్‌స్లామ్ టైటిల్) రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా అల్కరాజ్ రికార్డ్ సృష్టించాడు. టైటిల్ బరిలోకి దిగిన ఇరువురు కూడా యవ క్రీడాకారులే. కాని అల్కరాజ్ ప్రత్యర్థిని ఓడించి తొలిసారి యుస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.