గాలిలో ఉండి శ‌త్రువుపై నిఘా వేయ‌గ‌ల ‘దృష్టి 10 స్టార్‌లైన‌ర్‌’..

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశీయంగా త‌యారు చేసిన‌ తొలి మాన‌వ ర‌హిత విమానం (UAV) దృష్టి 10 స్టార్‌లైన‌ర్‌.. దీనికి ఇంటెలిజెన్స్‌, నిఘా సామ‌ర్థ్యాలున్నాయి. గాల్లో 36 గంటల పాటు ఎగ‌ర‌గ‌ల‌దు. ఈ విమానం 450 కిలోల పేలోడ్‌ను త‌న‌తో తీసుకెళుతుంది. ఈ దృష్టి 10 స్టార్‌లైన‌ర్‌ను హైద‌రాబాద్‌లోని తుక్కుగూడ‌లోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో నేవీ చీఫ్ అడ్మిర‌ల్ ఆర్ హ‌రి కుమార్ ప్రారంభించారు. దీనికి స్టాంగ్ 4671 స‌ర్టిఫికేష‌న్ రావ‌డంతో అన్ని ర‌కాల వాతావ‌ర‌ణాల్లోనూ ప‌నిచేయ‌గ‌ల‌ద‌ని స‌మాచారం.

కేవ‌లం 10 నెల‌ల స‌మ‌యంలోనే ఈ యుఎవిని తయారు చేయ‌డం అదాని డిఫెన్స్ నిబ‌ద్ధ‌త అని అడ్మిర‌ల్ హ‌రికుమార్ తెలిపారు. స‌ముద్రంపై ఆధిపత్యం, ఐఎస్ ఆర్ సాంకేతిక‌త‌లో ఆత్మ‌నిర్భ‌ర్‌కు ఇది ముంద‌డ‌గ‌ని అన్నారు. నౌకాద‌ళ కార్య‌క‌లాపాల‌లో దృష్టి 10 లైన‌ర్‌ను భాగ‌స్వామిని చేయ‌డంతో మా సామ‌ర్ధ్యాలు మెరుగుప‌డ‌తాయ‌ని ఆయ‌న తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.