టిఎస్‌పిఎస్‌సి ఛైర్మ‌న్‌, స‌భ్యుల రాజీనామా.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో టిఎస్‌పిఎస్‌సి లో జరిగిన పేప‌ర్ లీకేజి, ఇత‌ర అవ‌క‌త‌వ‌క‌ల గురించి తెలిసిందే. దీనివ‌ల‌న గ్రూప్ ఎక్జామ్స్‌తో పాటు మ‌రికొన్ని ప‌రీక్ష‌లు ర‌ద్ద‌యిన‌వి. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు నిరాశ‌కు గుర‌య్యారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం టిఎస్‌పిఎస్‌సిపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టింది. మ‌రెవ‌రూ భ‌విష్య‌త్‌లో నిరుద్యోగుల జీవితాల‌తో ఆట‌లాడ‌కుండా బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో బోర్డు ఛైర్మ‌న్, ఐదుగురు స‌భ్యులు రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై ఆమోదించారు. త్వర‌లో కొత్త క‌మిష‌న్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది.

టిఎస్‌పిఎస్‌సిలో ప్ర‌శ్నాప‌త్రాల లీకేజి విష‌యంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు, నిరుద్యోగులు ఛైర్మ‌న్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని, ఆయ‌న్ని తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఛైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ అప్ప‌టి ప్ర‌భుత్వం రాజీనామా నిర్ణ‌యాన్ని తిర‌స్క‌రించింది. క‌మిష‌న్‌లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దాల‌ని, సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టి కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌లు పార‌ద‌ర్శ‌కంగా నిర్వహించాల‌ని ఆదేశించింది. దాంతో ఆయ‌న రాజీనామా నిర్ణ‌యాన్ని వెనక్కితీసుకున్నారు. తాజాగా క‌మిష‌న్ ఛైర్మాన్ స‌భ్యులు రాజీనామా చేశారు.

Leave A Reply

Your email address will not be published.