అంతర్వేది సముద్ర తీరంలో దొరికిన 2 కచ్చిడి చేపలు.. రూ. 4లక్షలు
అంతర్వేది (CLiC2NEWS): కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో రెండు అరుదైన చేపలు దొరికాయి. వాటిని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందర్వేది పల్లిపాలెం మిని ఫిషింగ్ హార్బర్లో వేలం వేశారు. ఓ వ్యాపారి ఆ రెండు చేపలను రూ. 4 లక్షలకు కొనుగోలు చేశారు. అవి కచ్చడి చేపలని.. వాటిలో ఉండే తెల్లటి బ్లాడర్ (మావ్)ను ఔషధాలకు పౌరలా, శస్త్ర చికిత్సలో కుట్టు వేసే దారంలో ఉపయోగిస్తారని, వాటికి అందుకే అంత ధర పలికినట్లు సమాచారం.