తొమ్మిదో తరగతి విద్యార్థికి అరగంట వ్యవధిలో 2టీకాలు..
ఖరగ్‌పూర్ (CLiC2NEWS): పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువున్న విద్యార్థికి అరగంట వ్యవధిలో 2 టీకాలు వేశారు సిబ్బంది. ఆవిద్యార్థి మొదటి టీకా వేయించుకున్న అనంతరం ఇంటికి వెళ్లకుండా పాఠశాల గేటు వద్ద ఉన్నాడు. టీకా వేయించుకోవడానికి భయపడుతున్నాడని భావించిన పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలికి తీసుకువెళ్లి టీకా వేయించారు. అనంతరం ఆవిద్యార్థి తాను మొదటి టీకా కూడ వేయించుకున్నట్లు మొల్లగా చెప్పాడు. ముందే ఎందుకు చెప్పలేదని వైద్య సిబ్బంది ప్రశ్నించగా.. ఒకేరేజు రెండు టీకాలు వేస్తారని అనుకున్నా అని అమాయకంగా చెప్పాడావిద్యార్థి. దీంతో ఆందోళన చెందిన వైద్యులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఆవిద్యార్థి ఆరోగ్యం సాధారణంగా ఉందని నిర్థారించుకున్న సిబ్బంది ఇంటికి పంపించారు.