హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 20 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

HAL: హైదరాబాద్ నగరంలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 20 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషణ్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో సిఎంఎం (లెవల్-5 ) ఇంజినీర్ 4, మిడిల్ స్పెషలిస్ట్ 8, జూనియర్ స్పెషలిస్ట్ 8 పోస్టులు కలవు. అభ్యర్థులకు ఇంజినీరింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయస్సు సిఎంఎం పోస్టులకు 45 ఏళ్లు, మిడిల్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్ పోస్టుకు 35 ఏళ్లకు మించకూడదు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, పిడబ్ల్యూ బిడిలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుం రూ. 500, ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగుకులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను జులై 18వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంబర్వ్యూ , వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సిఎంఎం పోస్టుకు నెలకు వేతనం రూ. 60,000.. మిడిల్ స్పెషలిస్ట్ పోస్టులకు రూ. 50,000.. జూనియర్ పోస్టుకు రూ. 40,000 చెల్లిస్తారు.